NDL: జిల్లాలో జనగణన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నెల 24, 25, 26 తేదీలలో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. అయ్యలూరు మెట్టలోని ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి శిక్షణ జరుగుతుందని, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.