NLR: మంత్రి లోకేష్ ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరుకానున్నట్లు కూటమి నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు వెల్లడించారు.