శ్రీకాకుళం నగరంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రూ.2 కోట్లతో నిర్మించిన కార్గిల్ పార్కును ప్రారంభించారు. ఈ పార్కులో బాబాయ్ అబ్బాయ్ కాసేపు బ్యాట్ పట్టి బాక్స్ క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్, తదితరులు పాల్గొన్నారు.