NDL: కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కాలనీలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాసుతకర్ హరిరావు (72) భార్య మరణం తర్వాత ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుమారుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ బాబు గురువారం తెలిపారు.