VZM: చీపురుపల్లిలో ఈ నెల 15 నుంచి వేసవి క్రీడలు ప్రారంభం కానున్నాయి. TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ మల్లిక్ నాయుడు క్రీడలకు సంభందించిన షెడ్యూల్ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో MPL పేరుతో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే నెల 1 వరకు జరిగే పోటీలలో విజేతలకు రూ. 60,000 విలువ గల బహుమతులు అందించనున్నామని తెలిపారు.