KRNL: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అమలు, పురోగతిపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇవాళ కలెక్టర్ డా.ఏ. సిరి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరు, లక్ష్యాల సాధనపై అధికారులతో చర్చించి, నిర్దేశిత గడువుల్లో ఫలితాలు సాధించాలని ఆదేశించారు. ప్రజా సేవల్లో పారదర్శకత, వేగం పెంచాలని సూచించారు.