పార్వతీపురం మండలం సంగంవలసలో ఈనెల 21 నుంచి శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మశ్రీ పుల్లే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. 21న విఘ్నేశ్వర పూజ, గ్రామ ప్రదక్షిణ, జలాధివాసం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.