ELR: గణపవరంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రజల కోసం ఆయన రచించిన రాజ్యాంగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.