NTR: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు సోమవారం జరగనుంది. ఈ మేరకు విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్‌ను సెంట్రల్ ఏసీపీ దామోదర్ పరిశీలించారు. ఇఫ్తార్ విందుకు 600 మందికి వీఐపీ పాసులు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు మంత్రులు రానున్నట్లు చెప్పారు. ఈ మేరకు 250 మందితో ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.