NLR: అంటరానితనం, అసమానతలు లేని సమాజ స్థాపనే డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయమని జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఎంపి తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.