గుంటూరు: అమరావతిలో సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక్కడ మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారు. వీటిలో 1 నుంచి 4 టవర్లను జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ప్రధానమైన ఐదో టవర్ను ఏకంగా జీ+49 అంతస్తులతో భారీగా నిర్మిస్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి ఈ టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ విధించింది.