SKLM: మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం నేటి తరాలకు ఆదర్శం అని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.మోహనరావు కొనియాడారు. ఫూలే జయంతి సందర్భంగా ఇవాళ మందసలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆమన ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన ఒక ఆలోచన, ఒక ఉద్యమం, నేటి తరాలకు దిక్చూచి అని అన్నారు.