ATP: గుంతకల్లు పట్టణంలో 60 మంది AITUC ఆటో కార్మికులు గురువారం CITU భగత్ సింగ్ ఆటో యూనియన్‌లోకి చేరారు. వారిని CITU జిల్లా నాయకులు శ్రీనివాసులు, సాకే నాగరాజు కండువా కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. కార్మిక చట్టాల అమలు, కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, 8 గంటల పనిదినం అమలు చేయాలని డిమాండ్ చేశారు.