నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు.