ATP: అనంతపురం మహిళా నేత, ఏపీ వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా లింగాయత్ సామాజిక వర్గ సమస్యలు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో చర్చించారు. ఈ మేరకు సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.