SKLM: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో గత 23 నెలల్లో 322 మంది లబ్ధిదారులకు రూ.3.15 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.