KDP: కార్పొరేట్ విద్యాసంస్థలు నారాయణ, చైతన్య యాజమాన్యాలు ప్రైవేటు ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరుతో వేధిస్తున్నాయని DYFI నేతలు ఆరోపించారు. ఈ మేరకు డీఈవో కార్యాలయానికి వినతిపత్రం సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వేసవి ఎండల్లో కూడా ఇంటింటికి తిరగాలని బలవంతం చేస్తున్నారని తెలిపారు.