కోనసీమ: రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించి లోక్సభకు పంపిందని, అక్కడ ఆమోదముద్ర పడటం అభినందనీయమని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు . రాష్ట్రానికి మూడు రాజ ధానులంటూ ఏమీ చేయకుండా గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్తం చేశారని ఆయన విమర్శించారు.