ప్రకాశం: టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్‌గా దామచర్ల సత్య నియమితులయ్యారు. బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను టీడీపీ నియమించిన విషయం తెలిసిందే. దామచర్ల సత్య కొండేపి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏపీ మారిటైం ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. జోనల్ కో-ఆర్డినేటర్‌గా నియమితులు అవడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.