ATP: ఉరవకొండలో తాటి ముంజెలు విక్రయించే చిరు వ్యాపారులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముచ్చటించారు. పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన వ్యాపారుల వద్ద కూర్చొని వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి, లాభాలు, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. నిరుపేద వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చొరవ చూపుతుందని భరోసా ఇచ్చారు.