ప్రకాశం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సచివాలయంలో మంగళవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల చర్ల జనార్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ప్రకాశం జిల్లా అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.