సత్యసాయి: ధర్మవరం చేనేత క్లస్టర్ అభివృద్ధిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధి, మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మాస్టర్ మోడల్ ప్లాన్ ద్వారా ఆధునిక మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరిచి, ధర్మవరం నేత ఖ్యాతిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి వెల్లడించారు.