సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీలకు ట్రై సైకిళ్లు, పుష్కార్ట్స్, డస్ట్బీన్లను పంపిణీ చేశారు. గురువారం టౌన్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరీష్ బాబు, టీడీపీ నేత చింతపల్లి మహేష్ పాల్గొన్నారు. మండలంలోని గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పరికరాలను అందజేశారు.