ప్రకాశం: హనుమంతునిపాడు మండలం సీతారామపురంలో స్వర్ణ గ్రామ, రైతు సేవ కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ఇవాళ ఎమ్మెల్యే ముక్క ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. గ్రామాభివృద్ధి దిశగా ఈ భవనాలు ఉపయోగపడతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.