NLR: ఉదయగిరిలో ఈనెల 16న నియోజకవర్గ క్రైస్తవుల ఐక్య మహాసభ జరుగుతుందని నియోజకవర్గ క్రైస్తవుల ఐక్య వేదిక శనివారం తెలిపింది. క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, ధార్మిక సమస్యలను చర్చించే వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ వేదిక మత స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించిన హామీలను రక్షించాలని యావత్ క్రైస్తవ సమాజం కోరుకుంటుందని వివరించింది.