ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నాయకులు మన్నం సుబ్బయ్యను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. సుబ్బయ్య ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.