VZM: జిల్లాలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 22,940 మంది హాజరయ్యారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. మొత్తం 75 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిరంతర నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు.