AKP: రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందని జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం అచ్యుతాపురం ఎస్.కె.ఆర్. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే విజయ్ కుమార్, టీడీపీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకు మంత్రి తినిపించారు.