NLR: గుడ్లూరు మండలం మొగులూరు గ్రామంలోని కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఇవాళ అస్వస్థతకు గురైన వారిని వెంటనే గుడ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.