PPM: నీలావడి అగ్ని గంగమ్మ జాతర సందర్భంగా ఈ నెల 8, 9,10,11 తేదీలలో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో ప్రబంధకుడు ఎస్.లక్ష్మణరావు గురువారం తెలిపారు. రద్దీని బట్టి అదనంగా బస్సులు పెంచుతామని చెప్పారు. ప్రయాణికులు ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంప్రదించాలన్నారు.