ప్రకాశం: మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్లో శ్రీశైలం వెళ్లే భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు, అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. భక్తుల వివరాలు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, స్వయంగా వారికి ఎమ్మెల్యే వడ్డించారు. భక్తుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.