శ్రీకాకుళంలో ‘శాప్ లీగ్స్’ ఫుట్బాల్, బాక్సింగ్ పోటీలలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 న నగరంలోని కోడి రామమూర్తి స్టేడియంలో ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. శాప్ అధికార వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.