NDL: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల కానుకల హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి మొత్తం రూ.32,29,396 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హుండీల ద్వారా రూ.31,91,727, అన్నప్రసాదం రూ.22,986, గోసంరక్షణ ద్వారా రూ.14,683 వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.