VSP: సాగర్నగర్లోని అంధ బాలికల పాఠశాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యతను మెచ్చుకున్నారు. పరిశుభ్రత, బోధన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని తెలిపారు. చిన్నారుల సంగీత ప్రతిభకు ఆకర్షితులై ప్రత్యేకంగా మరొక రోజు వస్తానన్నారు. పూర్వ విద్యార్థుల విజయాలను ప్రశంసించారు.