PPM: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా సోమవారం కురుపాంలో స్దానిక MLA తోయక జగదీశ్వరీ అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు ఆమె లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ అన్న క్యాంటీన్ ప్రారంభంతో ఎంతోమంది నిరుపేదల ఆకలి తీరనుందని స్థానిక టీడీపీ నేతలు తెలిపారు. అలాగే నియోజకవర్గ కేంద్రానికి వివిధ పనుల మీద వచ్చిన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.