ELR: జంగారెడ్డిగూడెం మండలంలోని ఓ జీడిపప్పు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు ఉండ్రాజవరపు శివకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది జూలైలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆర్వీఎస్ మురళీకృష్ణ నేరం రుజువు కావడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విదిస్తూ తీర్పు వెల్లడించారు.