CTR: జిల్లాలో శనివారం జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్ష రంజాన్ పర్వదినం పురస్కరించుకుని వాయిదా వేసినట్లు బోర్డు అఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్ – 1 పరీక్ష ఈనెల 25వ తేదీ జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేశారన్నారు.