E.G: చాగల్లు ప్రధాన కూడలిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మార్కొండపాడుకు చెందిన పంది వీర్రాజు, నాగలక్ష్మి (52) దంపతులు శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. NTR విగ్రహం వద్ద ఎదురుగా వచ్చిన లారీ వారి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.