PPM: అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరుగుతుందని పెర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలు, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డును అందజేస్తారన్నారు.