కోనసీమ: మహర్షి భగీరథుని కృషి, పట్టుదల, సేవా నిరతి అందరికీ ఆదర్శప్రాయమని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం కలెక్టరేట్లో గురువారం మహర్షి 776 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసం కఠోర తపస్సుతో గంగమ్మ భూమికి రప్పించిన భగీరథుని కృషి అద్వితీయం అన్నారు.