PLD: జనాభా గణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రక్రియ అని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఆయన కార్యాలయంలో జనాభా గణన, ఇళ్ల జాబితా, గృహ గణన కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, పాంప్లెట్లను గురువారం ఆవిష్కరించారు. ప్రతి కుటుంబం తమ ఇళ్ల స్థితిగతులు, కుటుంబ వివరాలను గణన అధికారులకు నిజాయితీగా తెలియజేయాలని సూచించారు.