MDCL: నాచారం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యం సమస్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక రసాయన, ఫార్మా కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్థాలు గాలి, నీటి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. స్థానికులు దుర్వాసన, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ, PCB చర్యలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి.