BDK: సారపాక ఐటీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకట్ రామ్ శనివారం తెలిపారు. ఎలక్ట్రీషియన్, సోలార్, బ్యూటీ పార్లర్, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్, మెకానికల్ కోర్సుల్లో 45 రోజులపాటు భోజన వసతితో ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు.