RR: షాద్నగర్ నియోజకవర్గానికి మంజూరైన ఉచిత మోటార్ సైకిళ్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.