TPT: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో శిశు మరణాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన 10 శిశు మరణాలపై సమీక్ష చేసి కారణాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సమయానికి సేవలు అందించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో హెచ్చరించారు.