సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్ సంబంధించిన బయోమెట్రిక్ అప్టేట్, ఐరిస్ స్కాన్, పేరు మార్పులు, ఫొటో అప్డేట్, పుట్టిన తేదీ మార్పు, సెల్ నంబరు లింక్, కొత్తగా ఆధార్ కార్డులు ప్రింట్ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.