ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు పామూరు పట్టణంలోని ప్రముఖ సిద్ధాంతి కుమారస్వామి ఇంటి ఎదురుగా గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచ్ యాదాల సాయి కిరణ్ ఆధ్వర్యంలో నూతన బోరు ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.