నెల్లూరు 45వ డివిజన్ పెద్ద కాలువ వద్ద డ్రోన్‌తో దోమల మందు కొట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. పొరపాటున నోరు జారారు. ‘రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి, పొంగూరు నారాయణ’ అనాల్సింది “రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి” అని అన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.