NLR: ఇంటర్ ఫలితాల్లో దివ్యాంగురాలు దీవి భవాని పూజిత బుధవారం ఫలితాల్లో సత్తా చాటింది. పేదరికాన్ని అధిగమించి నెల్లూరు కేఏసీ ప్రభుత్వ కళాశాల నుంచి హెచ్ఈసీ ప్రథమ సంవత్సరంలో 488/500 మార్కులు సాధించింది. తండ్రి ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. సివిల్స్ లక్ష్యంగా చదువుతానని విద్యార్థి తెలిపింది. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమని ఈ విద్యార్థిని నిరూపించింది.