పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుంచి ఎల్విన్‌పేట జంక్షన్ వరకు సాగిన ర్యాలీలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.